Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం.. మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారం
- బాధితురాలికి ఫేస్‌బుక్‌లో పరిచయమైన నిందితుడు
- తన సోదరుడి బర్త్ డేకు రావాలంటూ ఆహ్వానం
- సోదరుడు, మరో వ్యక్తితో కలిసి అఘాయిత్యం
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన నిందితుడు తన సోదరుడి బర్త్‌డే అంటూ పిలిచి స్నేహితులతో కలిసి మహిళా కానిస్టేబుల్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను వీడియో తీసి బెదిరించడం మొదలుపెట్టాడు. నీమచ్ జిల్లాలో ఈ నెల మొదట్లో ఈ ఘటన జరగ్గా.. 13న బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు నిన్న వెల్లడించారు. మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడితోపాటు అతడి తల్లిని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలికి ఫేస్‌బుక్ ద్వారా నిందితుడు పరిచయం అయ్యాడు. స్నేహం క్రమంగా పెరగడంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్ మొదలైంది. ఈక్రమంలో తన తమ్ముడి పుట్టిన రోజంటూ బాధితురాలిని ఆహ్వానించాడు. అక్కడకు వెళ్లిన ఆమెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ప్రధాన నిందితుడు, అతడి సోదరుడితోపాటు మరో వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్టు బాధిత కానిస్టేబుల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అ
త్యాచారం అనంతరం వీడియో తీశారని తెలిపింది. ప్రధాన నిందితుడి తల్లి, అతడి బంధువు తనను చంపేస్తానని బెదిరించడమే కాకుండా, తన నుంచి డబ్బులు దోచుకునే ప్రయత్నం చేశారని ఆరోపించింది. ఇప్పటికే ప్రధాన నిందితుడు, అతడి తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.