KTR: హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు: అసెంబ్లీలో కేటీఆర్
- నగరంలో వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టులు
- గత ఏడాది కరోనాతో ఇబ్బందులు పడ్డాం
- ఆ సమయంలో తెలంగాణలో రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు
- గోనె సంచులకి కొరత వచ్చింది
- మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసే విధంగా ప్రోత్సాహం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సభలో కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీపై స్పందించారు. నగరంలో వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రాజెక్టులను చేపడుతున్నామని తెలిపారు. హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఇక రైతుల సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యలపై కేటీఆర్ మాట్లాడుతూ.. 'గత ఏడాది కరోనాతో ఇబ్బందులు పడ్డాం. ఆ సమయంలో తెలంగాణలో రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టాము. గోనె సంచులకి కొరత వచ్చినప్పుడు వాటిని మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసే విధంగా ప్రోత్సాహం అందించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. వరంగల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డిలో మొత్తం మూడు కంపెనీలు కలిసి 887 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. దీని వల్ల ఉపాధి అవకాశాలు కూడా వచ్చాయి' అని కేటీఆర్ తెలిపారు. వరి ధాన్యం ఉత్పత్తిలో భారత్లోనే అగ్రభాగాన ఉన్నామని కేటీఆర్ చెప్పారు.