Afghanistan: పంజ్ షీర్ ప్రతిఘటన దళంలో తండ్రి పనిచేశాడని.. చిన్నారిని దారుణంగా చంపేసిన తాలిబన్లు.. వీడియో ఇదిగో

Talibans Execute Kid Over Suspicion Of His Father Associated With Panjshir Resistance Forces
  • చిన్నపిల్లాడనీ కనికరం చూపని ఉగ్రవాదులు
  • చిన్నారి మృతదేహం వద్ద కన్నీరుమున్నీరైన చిన్నారులు
  • తఖర్ ప్రావిన్స్ లో తాలిబన్ల ఘాతుకం
మారామని తాలిబన్లు చెబుతున్నా.. అవి నీటి మీది రాతల్లానే ఉన్నాయి. వారి పాలనలో అరాచకాలు ఆగవు అనే చెప్పే మరో ఘటన తాజాగా జరిగింది. తండ్రి పంజ్ షీర్ ప్రతిఘటన దళంలో పనిచేశాడని.. చిన్న పిల్లాడని కూడా చూడకుండా అతడి కుమారుడిని తాలిబన్లు అతి కిరాతకంగా చంపేశారు.

ఈ ఘటన తఖర్ ప్రావిన్స్ లో వెలుగు చూసింది. పంజ్ షీర్ అబ్జర్వర్ అనే ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. చనిపోయిన చిన్నారి దగ్గర మరికొందరు చిన్నారులు చేరి కన్నీరుమున్నీరుగా విలపించడం నెటిజన్లను కన్నీళ్లు పెట్టించింది. చనిపోయిన చిన్నారిని మరో చిన్నారి లేపుతూ కనిపించడం అందర్నీ కదిలిస్తుంది.

తాలిబన్ల చేతికి పంజ్ షీర్ ప్రావిన్స్ వెళ్లిపోకుండా చివరికంటా ప్రతిఘటన దళాలు పోరాడాయి. తాలిబన్లకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. పెద్ద సంఖ్యలో తాలిబన్లను హతమార్చాయి. ఈ క్రమంలోనే ప్రతిఘటన దళంలోని సభ్యులను తాలిబన్లు వేటాడి చంపేశారు.
Afghanistan
Taliban
Panjshir
Resistance Forces

More Telugu News