Karnataka: బలవంతపు మతమార్పిడులపై చట్టం.. సీరియస్గా ఆలోచిస్తున్న కర్ణాటక సీఎం!
- కర్ణాటక మతమార్పిడుల వ్యతిరేక బిల్లు కోసం మంతనాలు
- ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న చట్టాలు
- తీవ్రంగా ఆలోచిస్తున్నామని చెప్పిన సీఎం బసవరాజ్ బొమ్మై
బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే అమలవుతున్న బలవంతపు మతమార్పిడుల వ్యతిరేక చట్టం విషయంలో తమ ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా ఆలోచిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. కళబుర్గి, బ్యాదరహళ్లి వంటి ప్రాంతాల్లో బలవంతపు మతమార్పిడులు జరిగాయని వార్తలు వచ్చాయి.
వీటి గురించి ప్రశ్నించగా సీఎం బదులిచ్చారు. ఈ ఘటనలు జరుగుతున్న క్రమంలోనే తాము చట్టం చేయడానికి తీవ్రంగా ఆలోచిస్తున్నామని బొమ్మై వివరించారు. ‘‘ఇలాంటి బలవంతపు మతమార్పిడుల ఘటనలు జరుగుతున్న నేపథ్యంలోనే ప్రలోభాలకు, బలవంతం చేయడం ద్వారా మతమార్పిడులు జరగకుండా చట్టం తెచ్చేందుకు ప్రయుత్నం’’ అని ఆయన తెలిపారు.
ఇదే విషయం గురించి వారం రోజుల క్రితం కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర కూడా ప్రశ్నలు లేవనెత్తారు. బలవంతపు మతమార్పిడుల వ్యతిరేక చట్టం విషయంలో ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని జ్ఞానేంద్ర అన్నారు.