Sensex: వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాకులు
- 254 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 37 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాకులు మార్కెట్లను నష్టాల్లోకి లాగాయి. మధ్యాహ్నం వరకు దాదాపు 556 పాయింట్ల వరకు సెన్సెక్స్ నష్టపోయింది. అయితే ఆ తర్వాత పవర్, మెటల్, ఫార్మా స్టాకులకు కొంతమేర కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు కొంతవరకు కోలుకున్నాయి.
ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 254 పాయింట్లు నష్టపోయి 59,413కి పడిపోయింది. నిఫ్టీ 37 పాయింట్లు పతనమై 17,711 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (6.18%), సన్ ఫార్మా (4.09%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.37%), టైటాన్ కంపెనీ (1.23%), టాటా స్టీల్ (1.16%).
టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.96%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.75%), ఏసియన్ పెయింట్స్ (-1.72%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.63%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.45%).