sensex: వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 286 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 93 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2.19 పాయింట్లు పెరిగిన బజాజ్ ఫిన్ సర్వ్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. సెప్టెంబర్ నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టులు ముగుస్తుండటం మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది.
ఈ నేపథ్యంలో లాభాలు, నష్టాల మధ్య సూచీలు ఊగిసలాడాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్ స్టాకులు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 286 పాయింట్లు నష్టపోయి 59,126కి పడిపోయింది. నిఫ్టీ 93 పాయింట్లు కోల్పోయి 17,618 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.19%), బజాజ్ ఫైనాన్స్ (2.05%), ఎన్టీపీసీ (0.96%), సన్ ఫార్మా (0.82%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.60%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.67%), ఏసియన్ పెయింట్స్ (-2.34%), యాక్సిస్ బ్యాంక్ (-1.87%), బజాజ్ ఆటో (-1.56%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.32%).