USA: ఆపరేషన్ సమయంలో ఏడ్చినందుకు కూడా బిల్లు.. యువతికి వింత అనుభవం!
- బ్రీఫ్ ఎమోషన్ పేరుతో రూ.800 బిల్లు
- మిడ్జ్ అనే మహిళకు ఎదురైన వింత అనుభవం
- అమెరికా ఆరోగ్య వ్యవస్థను ఏకిపారేస్తున్న నెటిజన్లు
అమెరికాలో ఒక యువతికి వింత అనుభవం ఎదురైంది. ఒక పుట్టుమచ్చ (మోల్)ను తొలగించుకోవడానికి మిడ్జ్ అనే యువతి ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఆమెకు శస్త్రచికిత్స చేసి పుట్టుమచ్చ తొలగించారు. ఆపరేషన్ సమయంలో భయమేసిన ఆమె ఏడ్చింది. ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది. డిశ్చార్జి సమయంలో ఆమెకు బిల్లు వేశారు. ఆ బిల్లు చూసిన ఆమెకు ఆశ్చర్యమేసింది.
ఎందుకంటే ఆ బిల్లులో ఆమె ఏడ్చినందుకు కూడా బిల్లు వేశారు. దీన్ని ఫొటో తీసిన ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాన్ని చూసిన నెటిజన్లు అమెరికా ఆరోగ్య వ్యవస్థపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ వ్యవస్థ గురించి అందరికీ అవగాహన కల్పించేందుకే ఈ ఫొటో షేర్ చేసినట్లు చెప్పింది. ఏడ్చినందుకు కూడా బిల్లు వేస్తారని తను అసలు ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
ఈ బిల్లు ఒక్కటి చాలు అమెరికన్ హెల్త్‌కేర్ వ్యవస్థ ఎలా ఉందో చెప్పడానికి అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరేమో ‘‘ఇంతకాలం నేను ఫ్రీగా ఏడ్చానని అనుకున్నా’’ అంటూ జోకులు పేలుస్తున్నారు.