Andhra Pradesh: ఏపీలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

APPSC job notification for medical officer posts in Aayush department

  • ఆయుష్ విభాగంలోని 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిపికేషన్
  • అక్టోబరు 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
  • దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబరు 25
  • నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ

ఆయుష్ డిపార్ట్‌మెంటులో ఖాళీగా ఉన్న 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్టుతో అభ్యర్థుల ఎంపిక జరగనుంది. అక్టోబరు 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. డిగ్రీ విద్యార్హతతోపాటు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్, మెడికల్ ప్రాక్టీషనర్‌గా రిజిస్ట్రేషన్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

అలాగే 2021 జూలై 1 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసుండాలి. ఆన్‌లైన్ విధానంలో జరిగే దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 25తో ముగుస్తుంది. దరఖాస్తు ఫీజు రూ.250 కాగా, పరీక్ష ఫీజు రూ.120 అని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగుల కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఫీజు మినహాయింపు లభిస్తుంది.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైటు https://psc.ap.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలకు సంబంధించిన తేదీలను మరికొన్ని రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఈ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News