Sensex: వరుసగా నాలుగో రోజు నష్టపోయిన మార్కెట్లు

Stock Markets ends in losses for 4th day

  • 360 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 86 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3.45 శాతం పడిపోయిన బజాజ్ ఫిన్ సర్వ్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫిన్ సర్వ్ తదితర కంపెనీల స్టాకులు నష్టపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 360 పాయింట్లు నష్టపోయి 58,765కి పడిపోయింది. నిఫ్టీ 86 పాయింట్లు కోల్పోయి 17,532 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (3.05%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.38%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.24%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.00%), టాటా స్టీల్ (0.77%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-3.45%), మారుతి సుజుకి (-2.45%), భారతి ఎయిర్ టెల్ (-2.22%), ఏసియన్ పెయింట్స్ (-2.02%), బజాజ్ ఫైనాన్స్ (-1.94%).

  • Loading...

More Telugu News