Harsha Kumar: టీడీపీని లేకుండా చేసేందుకు జగన్, పవన్ కుట్ర పన్నారు: హర్షకుమార్

Jagan and Pawan Kalyan plotting conspiracy to finish TDP say Harsha Kumar
  • వైసీపీ, జనసేన, బీజేపీ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాయి
  • పవన్ కల్యాణ్ కులాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు
  • పవన్ పర్యటనలకు ప్రభుత్వమే హైప్ క్రియేట్ చేస్తోంది
సీఎం జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీని లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ, జనసేనలు బీజేపీతో కలిసి ఒక పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నాయని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీని లేకుండా చేయడమే వీరి లక్ష్యమని అన్నారు. తనకు కులం ప్రాధాన్యత లేదని చెప్పుకునే పవన్ కల్యాణ్.... ఇప్పుడు కులాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.

పవన్ పర్యటనలకు అనుమతి లేదని చెపుతూ... ప్రభుత్వమే ఆయన పర్యటనలకు హైప్ క్రియేట్ చేస్తోందని అన్నారు. జనసైనికులకు ఆవేశం వచ్చిన తర్వాత పర్యటనలకు పర్మిషన్ ఇస్తుందని విమర్శించారు. రోడ్లపై పవన్ కల్యాణ్ కు చిత్తశుద్ధి ఉంటే 10 రోజులు తూర్పుగోదావరి జిల్లాలోనే ఉండి రోడ్లను బాగు చేయాలని చెప్పారు.
Harsha Kumar
Telugudesam
Pawan Kalyan
Janasena
Jagan
YSRCP
BJP

More Telugu News