MAA: ‘మా’ ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దంటూ ఎన్నికల అధికారికి విష్ణు విజ్ఞప్తి

Vishnu Writes To Returning Officer Of MAA On EVMs Usage
  • ఈవీఎంలను వినియోగించొద్దని విజ్ఞప్తి
  • బ్యాలెట్ పేపర్ తోనే ఎన్నికలు జరపాలని వినతి
  • ఈవీఎంలపై నమ్మకం లేదని కామెంట్
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)’ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ రాశారు. ఈ నెల 10న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు ఈవీఎంలను వినియోగించవద్దని, బ్యాలెట్ పేపర్ నే వాడాలని పేర్కొంటూ ‘మా’ అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న విష్ణు కోరారు. ఈవీఎంల పనితీరుపై తమకు నమ్మకం లేదన్నారు. దీనిపై ఎన్నికల అధికారి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

కాగా, గతంలో ఎన్నికలకు ఈవీఎంలనే ఉపయోగించారు. అయితే, వాటిని వినియోగించుకున్నందుకు ‘మా’ చెల్లింపులు చేయకపోవడంతో ఈసీఐఎల్ సంస్థ 'మా'ను బ్లాక్ లిస్ట్ లో చేర్చింది. ఈసారీ ఈవీఎంలనే వినియోగించేందుకు వీలుగా ఈసీఐఎల్ కు ‘మా’ విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది.
MAA
Manchu Vishnu
Elections
Tollywood

More Telugu News