ICMR: బీ కేర్ ఫుల్.. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉంది: ఐసీఎంఆర్

ICMR warns about Corona third wave
  • ఎనిమిది రాష్ట్రాలకు ఐసీఎంఆర్ హెచ్చరిక
  • రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలని సూచించిన ఐసీఎంఆర్
  • పిల్లలకు, టీకాలు వేయించుకోని వారికి ప్రమాదం ఉండే అవకాశం
భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే సమయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ (ఐసీఎంఆర్) కీలక హెచ్చరికలు జారీ చేసింది. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, ఝార్ఖండ్, గోవా, హర్యానా, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలను హెచ్చరించింది. మరో రెండు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.

మరోవైపు వైద్య నిపుణులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. టీకాలు వేయించుకోని వ్యక్తులు, పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని చెపుతున్నారు. ఈ సందర్భంగా, ఎయిమ్స్ భోపాల్ డైరెక్టర్ డాక్టర్ శర్మన్ సింగ్ మాట్లాడుతూ, థర్డ్ వేవ్ రావడం, రాకపోవడం ప్రజలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. అందరికీ వ్యాక్సిన్ వేయడంతో పాటు, కోవిడ్ ప్రొటోకాల్ ను కరెక్ట్ గా పాటిస్తే థర్డ్ వేవ్ ను ఆపొచ్చని తెలిపారు.
ICMR
Corona Third Wave

More Telugu News