Social Media: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. విదేశాల్లో ఉన్నవారిని కూడా విచారించాలని సీబీఐకి హైకోర్టు ఆదేశం
- తాజా స్టేటస్ రిపోర్టును హైకోర్టుకు నివేదించిన సీబీఐ
- ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేశామని తెలిపిన సీబీఐ
- ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్న హైకోర్టు
జడ్జిలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సీబీఐ చేస్తున్న దర్యాప్తుపై ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కేసు విచారణకు సంబంధించి తాజా స్టేటస్ రిపోర్టును హైకోర్టులో సీబీఐ దాఖలు చేసింది. ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, ఛార్జ్ షీట్ వేశామని కోర్టుకు తెలిపింది.
ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ విదేశాల్లో ఉన్న నిందితులను కూడా విచారించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జడ్జిలకు సంబంధించి ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై దృష్టి సారించాలని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.