Samantha: సమంతను అతడు అక్క అని పిలిచేవాడు.. అపార్థం చేసుకోవద్దు: సమంత మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్
- ప్రీతమ్ జుకాల్కర్ పై నెటిజన్ల ఆరోపణలు
- అతడి వల్లే చై-సామ్ విడిపోయారని విమర్శలు
- గతంలో సమంతను జీజీ అని పిలిచిన ప్రీతమ్
- జీజీ అంటే ఏంటో తెలియక నానార్థాలు తీసిన నెటిజన్లు
- జీజీ అంటే అక్క అని అర్థాన్ని వివరించిన సాధన సింగ్
టాలీవుడ్ నటులు సమంత-నాగ చైతన్యల పెళ్లి బంధానికి స్వస్తి పలకడంతో సమంత పర్సనల్ స్టయిలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ పై నెటిజన్లు తీవ్ర ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. అతడి వల్లే ముచ్చటైన సమంత-నాగచైతన్య జంట విడిపోయిందని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. అందుకు సాక్ష్యంగా ప్రీతమ్ జుకాల్కర్ గతంలో సామాజిక మాధ్యమాల్లో చేసిన కొన్ని వ్యాఖ్యలను చూపెడుతున్నారు.
గతంలో తాను సమంతతో కలిసి సంతోషంగా గడిపానని తెలుపుతూ ఆమెను ప్రీతమ్ జీజీగా సంబోధిస్తూ పోస్ట్ చేశాడు. అయితే, జీజీ అంటే ఏంటో తెలియక నెటిజన్లు ఎన్నో అర్థాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంతను ప్రీతమ్ జుకాల్కర్ అక్క అని పిలిచేవాడని సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ తన సామాజిక మాధ్యమ ఖాతా స్టోరీస్‌లో చెప్పారు. వారి మధ్య ఉన్న అనుబంధాన్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారని అన్నారు.
'జీజీ' అంటే 'అక్క' అని అర్థం అని వివరిస్తూ ఆమె గూగుల్ ట్రాన్స్లేషన్ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేశారు. తనకు ఈ రోజు షూట్ లేనపోవడంతో, భగవంతుడు నాకు తెలివిని ప్రసాదించడంతో ఈ పోస్టు చేస్తున్నానని చురకలంటించారు. కొందరు తెలివిలేని వాళ్లకు దీన్ని షేర్ చేయాలనుకుంటున్నానని చెప్పారు. కాగా, ఇకనైనా ప్రీతమ్ జుకాల్కర్ పై ఆరోపణలు చేయడం మానుకోవాలని సమంత ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.