YS Sharmila: దొర మాటిచ్చి 4 ఏండ్లయినా అది అమలు కాలేదు: వైఎస్ షర్మిల
- బీసీ పాలసీ అమలు కావట్లేదు
- బీసీలంటే దొరగారి దృష్టిలో మీటింగులకు మందిని తెచ్చేవారు
- గొర్లు, బర్లు కాసుకునే వారు
- ఆత్మగౌరవ భవనాలకు అమ్ముడుపోయేవారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. 'దొర మాటిచ్చి 4 ఏండ్లయినా పత్తాలేని బీసీ పాలసీ అమలు. బీసీలంటే దొరగారి మీటింగ్లకు మందిని తెచ్చేవారు, గొర్లు, బర్లు కాసుకునే వారు, ఆత్మగౌరవ భవనాలకు అమ్ముడుపోయేవారు. అంతే తప్ప.. అధికారంలో పాలుపంచుకునే వారు, చట్టాలు చేసేందుకు అర్హులు కారు, అభివృద్ధికి నోచుకునే వారు కాదు' అని షర్మిల పేర్కొన్నారు.
'అందుకే కేసీఆర్ దొర 2017లో మీటింగ్ పెట్టి మూడు రోజులు ముచ్చట చేసిన 210 తీర్మానాలు మూలకు పెట్టిండు, బీసీ సబ్ ప్లాన్ లేదు, ఇండస్ట్రియల్ పాలసీ లేదు, నిధులు లేవు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. 210 తీర్మానాలను గంగలో కలిపాడు కేసీఆర్. ఇది దొరగారికి 54 శాతం ఉన్న బీసీలపై ఉన్న ప్రేమ' అని షర్మిల విమర్శించారు.