Bandi Sanjay: బండి సంజ‌య్ త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కాశ్ రాజ్ స్పంద‌న‌

prakash raj on bandi sanjay comments

  • తుక్‌డే తుక్‌డే గాళ్లు, టెర్ర‌రిస్టులు, సంఘ‌విద్రోహ‌శ‌క్తులు అని కొంద‌రు అన్నారు
  • అటువంటి 'మా' వాతావ‌ర‌ణంలో నేను ఉండ‌లేను
  • బండి సంజ‌య్ జాతీయ వాదం గెలిచిందంటూ ట్వీట్ చేశారు
  • 'మా' లోకి రాజ‌కీయాలు  

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ ఎన్నిక‌ల్లో ప్ర‌కాశ్ రాజ్ ఓడిపోయిన నేప‌థ్యంలో బీజేపీ తెలంగాణ‌ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప‌లు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన మా ఓటర్లకు ధన్యవాదాలు అంటూ, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే గ్యాంగ్‌కు మద్దతు పలికిన వారికి ఇది సరైన గుణపాఠం అని ఆయ‌న వ్యాఖ్యానించారు. బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కాశ్ రాజ్ స్పందించారు.

తుక్‌డే తుక్‌డే గాళ్లు, టెర్ర‌రిస్టులు, సంఘ‌ విద్రోహ‌శ‌క్తులు అంటూ కొంద‌రు వ్యాఖ్య‌లు చేశారని, అటువంటి 'మా' వాతావ‌ర‌ణంలో తాను ఉండ‌లేన‌ని ప్రకాశ్ రాజ్ అన్నారు. మ‌రోవైపు, బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ జాతీయ వాదం గెలిచిందంటూ ట్వీట్ చేశార‌ని ఆయ‌న గుర్తు చేశారు.  

'మా' లోకి రాజ‌కీయాలు వ‌చ్చాయని, అలాంటి వాతావ‌ర‌ణంలో తాను ఉండ‌లేన‌ని ప్ర‌కాశ్ రాజ్ చెప్పారు. త‌న‌ను నిర్మాతలు, ద‌ర్శ‌కులు, ప్రేక్ష‌కుల నుంచి ఎవ్వ‌రూ వేరు చేయ‌లేరని తెలిపారు. తాను అసోసియేష‌న్ నుంచి మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని, తెలుగు సినిమాల నుంచి కాద‌ని చెప్పారు. తాను గ‌తంలో రాజ‌కీయాల్లో పోటీ చేసి ఓడినంత మాత్రాన రాజ‌కీయాల నుంచి బ‌య‌ట‌కు రాలేద‌ని చెప్పారు.

'నా నెక్ట్స్ స్టెప్ ఏంటీ? అని అడుగుతున్నారు. ఇది డ్యాన్స్ కాదు క‌దా? స్టెప్పులు వేయ‌డానికి. నేను ఎన్నిక‌ల ముందు ఏం చెప్పానో దానిపై నిల‌బ‌డ్డాను. అది తప్పు కాదు. అవ‌త‌లి వారి గురించి నేను కామెంట్లు చేయ‌ట్లేదు. మంచు విష్ణు గెలుపును స్వాగ‌తిస్తున్నాను. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాలి' అని ప్ర‌కాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News