VH: మౌన దీక్షకు దిగిన కాంగ్రెస్ నేత వీహెచ్
- లఖింపూర్ ఖేరీలో జరిగిన హింస ఘటనపై నిరసన
- కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్
- నిందితులపై చర్యలు తీసుకోవాలని వ్యాఖ్య
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద మౌన దీక్షకు దిగారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు నిరసనగా వీహెచ్ దీక్షకు దిగారు.
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. లఖింపూర్ ఖేరీలో జరిగిన హింస ఘటనలో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాగా, లఖింపూర్ ఖేరీ ఘటనలో విచారణను జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే.