KKR: ఐపీఎల్ క్వాలిఫయర్-2: రాణించిన కోల్ కతా బౌలర్లు... ఢిల్లీ స్కోరు 135-5
- షార్జాలో మ్యాచ్
- టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
- భారీ స్కోరు సాధించలేకపోయిన ఢిల్లీ
- ఓ మోస్తరు ప్రదర్శన కనబర్చిన ధావన్, అయ్యర్
ఐపీఎల్ క్వాలిఫయర్-2లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. పిచ్ ఏమాత్రం సహకరించకపోవడంతో ఆ జట్టులోని ప్రధాన బ్యాట్స్ మెన్ స్వేచ్ఛగా బ్యాట్లు ఝుళిపించలేకపోయారు.
ఓపెనర్ శిఖర్ ధావన్ `(36), శ్రేయాస్ అయ్యర్ (30 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, లాకీ ఫెర్గుసన్ 1, శివం మావి 1 వికెట్ తీశారు. పృథ్వీ షా 18, మార్కస్ స్టొయినిస్ 18 పరుగులు చేశారు. కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం 6 పరుగులు చేసి లాకీ ఫెర్గుసన్ బౌలింగ్ వెనుదిరిగాడు.
మొన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్ కతా ఇలాగే బౌలింగ్ చేసి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును అద్భుతంగా కట్టడి చేసి, ఆపై విజయవంతంగా లక్ష్యఛేదన చేసింది. మరి ఈ మ్యాచ్ లో కూడా స్వల్ప లక్ష్యమే నిలవడంతో కోల్ కతా ఎలా ఆడుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.