aryan: జైలు టాయిలెట్ వాడాల్సి వస్తుందని తిండి, నీళ్లు సరిగ్గా తీసుకోకుండా మొండిచేస్తోన్న షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్
- డ్రగ్స్ వ్యవహారం కేసులో జైలులో ఆర్యన్
- తనకు ఆకలిలేదని చెప్పేస్తోన్న నిందితుడు
- జైలు టాయిలెట్ అంటేనే భయపడిపోతోన్న వైనం
- పరిస్థితిని తెలుసుకుంటోన్న షారుఖ్
ముంబై తీరంలో షిప్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం కేసులో విచారణ జరుపుతోన్న మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం ప్రస్తుతం ముంబై కేంద్ర కారాగారంలో రిమాండులో వున్నాడు.
సకల సౌకర్యాలు ఉండే అధునాతన భవనంలో నివాసం, ఫైవ్ స్టార్ హోటళ్లలో భోజనం, నౌకల్లో పార్టీలతో జల్సాగా గడిపే ఆర్యన్ ఖాన్.. ఇప్పుడు జైలు జీవితాన్ని అనుభవించలేక, బయటకు రాలేక మానసిక వేధన అనుభవిస్తున్నాడు.
జైలులో అతడు సరిగ్గా భోజనం చేయట్లేడని, నీళ్లు కూడా సరిగ్గా తాగట్లేడదని జైలు అధికారులు తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆయన భోజనం, నీళ్లు తీసుకోకపోవడానికి పెద్ద కారణమే ఉంది. ఒకవేళ వాటిని తీసుకుంటే జైలు టాయిలెట్ వాడాల్సి వస్తుందని ఆర్యన్ ఖాన్ భయపడుతున్నాడట.
అతని పరిస్థితిని గమనించిన జైలు అధికారులు ఆర్యన్ కు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. భోజనం, నీరు తీసుకోవాలని, టాయిలెట్‌ను వాడుకోవాలని చెబుతున్నారు. అయినా వారి మాటను ఆర్యన్ వినడం లేదు. ఆకలి వేయడం లేదని చెప్పేస్తున్నాడట. జైలులో ఆర్యన్ ఖాన్ నాలుగు రోజులుగా స్నానం కూడా చేయలేదు. అతడి ఆరోగ్యం గురించి జైలు అధికారుల ద్వారా షారుఖ్ ఖాన్ వివరాలు తెలుసుకుంటున్నాడు.
మరోవైపు, ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై నిన్న ముంబైలోని సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. అయితే, బెయిల్ పిటిషన్‌పై వాదనలను కోర్టు నేటికి వాయిదా వేసింది. డ్రగ్స్ వ్యవహారంలో ఆర్యన్ ఖాన్ పాత్ర ఉందని విచారణలో తేలిందని కోర్టుకు ఎన్సీబీ తెలిపింది. మరి, నేడు ఆయనకు బెయిల్ వస్తుందా? అన్న ఉత్కంఠ నెలకొంది.