Spice Jet: స్పైస్ జెట్ లైసెన్స్ ను సస్పెండ్ చేసిన డీజీసీఏ
- 30 రోజుల పాటు లైసెన్స్ సస్పెన్షన్
- ప్రమాదకరమైన వస్తువులు రవాణా చేసినందుకు నిషేధం
- నష్ట నివారణ చర్యలు చేపట్టిన స్పైస్ జెట్
ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ స్సైస్ జెట్ లైసెన్స్ ను విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) తాత్కాలికంగా నిలిపివేసింది. 30 రోజుల పాటు లైసెన్స్ ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. ప్రమాదకర వస్తువులను రవాణా చేసిందనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో లిథియం-అయాన్ బ్యాటరీలతో సహా ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లేందుకు స్పైస్ జెట్ ను అనుమతించబోమని డీజీసీఏ తెలిపింది.
డీజీసీఏ నిబంధనల ప్రకారం.. ఆరోగ్యం, భద్రత, పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లడం నిషిద్ధం. మరోవైపు డీజీసీఏకు స్పైస్ జెట్ వివరణ ఇచ్చింది. ఒక రవాణాదారుడు ప్రమాదకరం కాని వస్తువులుగా ప్రకటించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపింది. నష్ట నివారణ చర్యలను చేపట్టామని చెప్పింది.