Devineni Uma: రాష్ట్రంలో లాంతర్లు, కొవ్వొత్తులకు మళ్లీ అవసరం ఏర్పడింది: దేవినేని ఉమ
- ఐదేళ్ల టీడీపీ పాలనలో విద్యుత్ కోతలనేవే లేవు
- ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అంధకారం
- ఉన్న ప్రాజెక్టులను విస్మరించడం వల్లే ఈ దుస్థితి
రాష్ట్రంలో మళ్లీ కొవ్వొత్తులు, లాంతర్ల అవసరం పడిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి, మైలవరం మండలంలోని కీర్తిరాయునిగూడెంలో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న దేవినేని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం అంధకారంగా మారిందని ఆరోపించారు. ఐదేళ్ల టీడీపీ హయాంలో విద్యుత్ కోతలు అనేవే జనం ఎరుగరని అన్నారు. ఇప్పుడేమో ప్రజలకు మళ్లీ లాంతర్లు, కొవ్వొత్తుల అవసరం ఏర్పడిందని అన్నారు. అందుబాటులో ఉన్న ప్రాజెక్టులను విస్మరించి కమీషన్ల కోసం అధిక ధరలకు బయటి రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొంటున్నారని ఉమ విమర్శించారు.