athawale: భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగకూడదు: కేంద్ర మంత్రి అథవాలే
- భారత్, పాక్ మధ్య ఈ నెల 24న టీ20 మ్యాచ్
- జమ్మూకశ్మీర్‌లో పాక్ ప్రోత్సాహంతో ఉగ్రవాద కార్యకలాపాలు
- వలస కూలీల హత్యోదంతాలు
- మ్యాచ్ విషయంపై బీసీసీఐ కార్యదర్శితో మాట్లాడతా
భారత్, పాక్ మధ్య ఈ నెల 24న టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌పై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అభ్యంతరాలు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో పాక్ ప్రోత్సాహంతో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. అలాగే, వలస కూలీల హత్యోదంతాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు.
ఓ వైపు ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుంటే, మరోవైపు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగడం సరికాదని అభిప్రాయపడ్డారు. పాక్ ఎలాంటి గుణ పాఠాలూ నేర్చుకోవట్లేదని చెప్పారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను ఆపకపోతే పాక్‌పై భారత్ యుద్దం ప్రకటించాలని ఆయన అన్నారు. కశ్మీర్‌లో అభివృద్ధి జరగకుండా చూడాలని పాక్ కుట్రలు పన్నుతోందని చెప్పారు. ఇటువంటి సమయంలో ఇరు దేశాల మధ్య మ్యాచ్ జరగకూడదన్న విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షాతో తాను చర్చిస్తానని అన్నారు.