Afghanistan: తాలిబన్ల ఘాతుకం.. మహిళా క్రీడాకారిణి తల నరికి చంపిన వైనం!

Talibans beheads woman volleyball player
  • అండర్-19 వాలీబాల్ క్రీడాకారిణిని హతమార్చిన తాలిబన్లు
  • ఈ నెల ప్రారంభంలోనే ఆమెను హత్య చేసిన ముష్కరులు
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణం
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు ఆటవిక, అరాచక పాలన చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. తమకు నచ్చని వారిని ఊచకోత కోస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై వారు ఘోరాలకు పాల్పడుతున్నారు. మహిళలు ఆటలు ఆడొద్దని తాలిబన్లు గతంలోనే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అండర్-19 జాతీయ వాలీబాల్ క్రీడాకారిణి మహ్జాబిన్ హకీమిని తల నరికి, అత్యంత పాశవికంగా హతమార్చారు. ఈ నెల ప్రారంభంలో ఈ దారుణం జరిగినప్పటికీ... ఆలస్యంగా ఇది వెలుగుచూసింది.

ఆ జట్టు కోచ్ సురాయా అఫ్జాలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె కుటుంబసభ్యులను తాలిబన్లు బెదిరించడంతో వారు ఈ విషయాన్ని బయటపెట్టలేకపోయారని చెప్పారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమించుకున్న నేపథ్యంలో ఇద్దరు క్రీడాకారిణులు మాత్రమే దేశాన్ని విడిచి వెళ్లగలిగారని... మిగిలిన వారికి వెళ్లడం సాధ్యం కాలేదని చెప్పారు. మహ్జాబిన్ కూడా పారిపోయి ఉంటే ప్రాణాలతో బతికి ఉండేదని అన్నారు. మరోవైపు తాలిబన్ల హింసాకాండకు భయపడి మహిళా క్రీడాకారిణులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తలదాచుకుంటున్నారు.
Afghanistan
Taliban
Woman Player
Volleyball Player
Behead

More Telugu News