Pawan Kalyan: సీఎం పదవిని సైతం వదులుకున్నారు.. అలాంటి వారే మాకు స్ఫూర్తి: పవన్ కల్యాణ్
- జనసేన పార్టీ ప్రయాణం వెనుక కొందరు స్ఫూర్తిప్రధాతలు ఉన్నారు
- వారిలో బూర్గుల రామకృష్ణారావు ఒకరు
- తెలుగు వారందరూ ఒక్కటిగా ఉండాలని చెప్పారు
- కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి
జనసేన పార్టీ ప్రయాణం, ఆశయాల వెనుక కొందరు స్ఫూర్తిప్రధాతలు ఉన్నారని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారిలో బూర్గుల రామకృష్ణారావు ఒకరని తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ సమయంలో తెలుగు వారందరూ ఒక్కటిగా ఉండాలని చెప్పారని గుర్తు చేశారు. ఆ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి పదవిని సైతం వదులుకున్నారని చెప్పారు. అటువంటి మహానుభావులే తమకు స్ఫూర్తిప్రధాతలని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి పీవీ నరసింహారావు అని పవన్ అన్నారు. ఎన్నో భూ సంస్కరణలు ప్రవేశపెట్టారని చెప్పారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అలాగే, కేవలం అతి తక్కువ సమయం ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య ఎన్నో సేవలు అందించారని చెప్పారు. కర్నూలు జిల్లాకు శ్రీ దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని పవన్ డిమాండ్ చేశారు.