Apollo Hospitals: త్వరలోనే చిన్నారులకు కొవిడ్ టీకాలు.. కోమార్బిడిటీస్‌తో బాధపడుతున్న వారికి ఉచితం: అపోలో చైర్మన్

Apollo Announces Free Covid Vaccination For Children

  • 2-18 ఏళ్ల మధ్య వారికి రెండు డోసులు కొవాగ్జిన్ టీకా
  • 12-18 ఏళ్ల లోపు వారికి సూది రహిత జైకోవ్-డి వ్యాక్సిన్
  • ఒకటి రెండు మోతాలు, మరోటి మూడు మోతాదులు
  • ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రారంభిస్తామన్న అపోలో గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి

ఇప్పటి వరకు 18 ఏళ్లు పైబడిన వారికే కరోనా టీకాలు అందుబాటులో ఉండగా, త్వరలోనే  చిన్నారులకు కూడా టీకాలు వేయనున్నట్టు అపోలో గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. అయితే, తొలి ప్రాధాన్యం మాత్రం కోమార్బిడిటీస్ (సహ రుగ్మతలు)తో బాధపడుతున్న వారికేనని తెలిపారు. వీరికి ఉచితంగా టీకాలు వేస్తామని పేర్కొన్న ఆయన.. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందన్నారు.

2 నుంచి 18 ఏళ్ల లోపు వారికి కొవాగ్జిన్ టీకా ఇప్పటికే సిద్ధమైందని, ఈ టీకాను రెండు డోసుల్లో 28 రోజుల వ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అలాగే, 12 నుంచి 18 ఏళ్ల వయసు వారికి జైకోవ్-డి టీకా సిద్ధమైందని, దీనిని 28 రోజుల వ్యవధిలో మూడు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుందని ప్రతాప్‌ సి.రెడ్డి తెలిపారు. ఇది సూది రహిత వ్యాక్సిన్ అని పేర్కొన్నారు. త్వరలోనే టీకా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News