Andhra Pradesh: టీటీడీ బోర్డులో నేరచరితులా?: ఏపీ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
- నియమించినవారికి నోటీసులివ్వండి
- దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవోల వివరణ తీసుకోండి
- మూడు వారాల్లోగా రిపోర్టివ్వాలని ఆదేశం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో నేర చరితులను నియమించడం పట్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ హైకోర్టు విచారించింది. నేరచరిత్ర ఉన్న వారిని నియమించిన వారికి నోటీసులివ్వాలని, దానిపై వివరణ తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవోకు నోటీసులివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లోగా దీనిపై రిపోర్టు ఇవ్వాలని సర్కారుకు స్పష్టం చేసింది.