Manchu Vishnu: ఈ నెల 31న ఎగ్జైటింగ్ న్యూస్ చెబుతా... ఇది చాలా పెద్దది: మంచు విష్ణు

Manchu Vishnu says he will ready to make a big announcement
  • ఇటీవల 'మా' అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు
  • మేనిఫెస్టో అమలుకు చర్యలు
  • ఇచ్చిన హామీలపై కసరత్తులు
  • 'మా' సభ్యుల సంక్షేమమే పరమావధి అని వెల్లడి
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు తమ ప్యానెల్ మేనిఫెస్టో అమలుపై ఒక్కొక్క అడుగు వేస్తున్నారు. ఇటీవలే మహిళా ఆర్టిస్టుల భద్రత కోసం కమిటీ ప్రకటించిన మంచు విష్ణు తాజాగా మరో బిగ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. అక్టోబరు 31న ఓ ఎగ్జైటింగ్ న్యూస్ చెబుతానని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇది 'మా'కు సంబంధించిన విషయమని, చాలా పెద్ద వార్త అని తెలిపారు.

ఇటీవల 'మా' ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు తన ప్యానెల్ తరఫున అనేక హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయడమే తన తక్షణ కర్తవ్యమని ప్రమాణస్వీకారం సందర్భంగా వెల్లడించారు. ప్రత్యర్థి ప్యానెల్ రాజీనామాలను ఆమోదించని మంచు విష్ణు... ప్రకాశ్ రాజ్ వర్గం కూడా తనకు సహకరించాలని కోరారు.
Manchu Vishnu
Big Announcement
Exiting News
MAA
Tollywood

More Telugu News