Basavaraj Bommai: పునీత్ ను బతికించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాం: కర్ణాటక సీఎం బొమ్మై

Basavaraj Bommai talks about Puneeth Rajkumar demise
  • మృత్యువుతో పోరాడి ఓడిన పునీత్ రాజ్ కుమార్
  • చివరి క్షణాల్లో ఆసుపత్రిలోనే ఉన్న సీఎం బొమ్మై
  • కళారంగానికి తీరని లోటు అంటూ వ్యాఖ్యలు
  • ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఉంటాయని వెల్లడి
హీరో పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలియగానే కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై వెంటనే బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యుల శ్రమ నిష్ఫలం కావడంతో పునీత్ కన్నుమూయడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పునీత్ ను కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని అన్నారు. కానీ అందరినీ విషాదంలో ముంచెత్తుతూ పునీత్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిపారు.

అతడొక యూత్ ఐకాన్ అని కొనియాడారు. చిత్ర, కళారంగానికి ఇదొక బాధాకరమైన ఘటన అని, తాము ఒక మంచి నాయకుడ్ని కోల్పోయామని బొమ్మై వివరించారు. దివంగత పునీత్ రాజ్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వ పూర్తి లాంఛనాలతో అంత్యక్రియలు ఉంటాయని వెల్లడించారు.

కాగా, విక్రమ్ ఆసుపత్రి నుంచి పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయాన్ని నివాసానికి తరలించారు. అభిమానుల సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Basavaraj Bommai
Puneeth Rajkumar
Demise
Karnataka

More Telugu News