Afghanistan: నబీ, గుల్బదిన్ అద్బుత భాగస్వామ్యం.. ఆఫ్ఘనిస్థాన్ 147/6

Afghanistan posts respectable score against Pakistan after Nabi and Gulbadin fighting
  • టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్
  • గ్రూప్-2 మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్
  • పాక్ బౌలర్లపై ఎదురుదాడి చేసిన ఆఫ్ఘన్లు
టీ20 వరల్డ్ కప్ గ్రూప్-2లో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తలపడుతున్నాయి. దుబాయ్ లో జరుగుతున్న ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఓ దశలో 76 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకున్న ఆఫ్ఘన్ జట్టును కెప్టెన్ నబీ, గుల్బదిన్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేయడంతో స్కోరు 100 పరుగులు దాటింది.

చివరి ఓవర్లలో పాక్ బౌలర్లపై నబీ, గుల్బదిన్ ఎదురుదాడి చేయడంతో గౌరవప్రదమైన స్కోరు సాధ్యమైంది. నబీ 35, గుల్బదిన్ 35 పరుగులతో అజేయంగా నిలిచారు. అంతకుముందు నజీబుల్లా జాద్రాన్ 22, కరీమ్ జన్నత్ 15 పరుగులు సాధించారు. పాక్ బౌలర్లలో ఇమాద్ వాసి 2, షహీన్ అఫ్రిది 1, హరీస్ రవూఫ్ 1, హసన్ అలీ 1, షాదాబ్ ఖాన్ 1 వికెట్ తీశారు.
Afghanistan
Nabi
Gulbadin
Pakistan
Group-2
Super-12
T20 World Cup

More Telugu News