Pawan Kalyan: ఆ సినిమాలో బాలనటుడిగా పునీత్ పెర్ఫార్మెన్స్ ఇప్పటికీ నా మదిలో నిలిచే ఉంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan re collects Punit Rajkumar performance as child artist
  • బెట్టదహూవే చిత్రంలో నటించిన పునీత్
  • బాలనటుడిగా ప్రస్థానం ఆరంభం
  • ఆ సినిమాతో పునీత్ పై అభిమానం ఏర్పడిందన్న పవన్
  • ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ట్వీట్
కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ అకాలమరణం తనను తీవ్ర విషాదానికి గురిచేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. పునీత్ రాజ్ కుమార్ మృతి దురదృష్టకరమని పేర్కొన్నారు. "బాలనటుడిగా తన తొలి చిత్రం బెట్టదహూవేలో పునీత్ నటన ఇప్పటికీ నా మదిలో కదలాడుతోంది. ఆ సినిమా చూసినప్పటి నుంచి అతడిపై చెరగని అభిమానం ఏర్పడింది. మై డియర్ బ్రదర్ పునీత్... నీ అంతిమయాత్రలో ఆ భగవంతుడు వెంట ఉండాలని కోరుకుంటున్నాను. పునీత్ కుటుంబ సభ్యులకు, శివరాజ్ కుమార్ (పునీత్ సోదరుడు)కు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను" అంటూ పవన్ ట్విట్టర్ లో స్పందించారు.
Pawan Kalyan
Puneeth Rajkumar
Demise
Bettada Hoove
Karnataka

More Telugu News