Mohan Babu: 'చిరు మీద అభిప్రాయం ఏంటీ?' మోహన్ బాబును అడిగిన బాలకృష్ణ.. టీడీపీ పగ్గాలు తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకు ఇచ్చావన్న మోహన్ బాబు.. 'ఆహా' వీడియో ఇదిగో
- నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు.. అంటూ బాలకృష్ణ ఓటీటీలోకి
- ఆహాలో అన్స్టాపబుల్ పేరిట షో నవంబర్ 4 నుండి ప్రసారం
- ఆసక్తికర ప్రశ్నలు అడిగిన బాలయ్య
- మంచు లక్ష్మి, మంచు విష్ణుతో షోకి వచ్చిన మోహన్ బాబు
'నేను మీకు తెలుసు.. నా స్థానం మీ మనసు..' అంటూ బాలకృష్ణ ఓటీటీలోకి వచ్చేశారు. 'ఆహా'లో 'అన్స్టాపబుల్' పేరిట నవంబర్ 4 నుండి ప్రసారం కానున్న కార్యక్రమంలో బాలకృష్ణ హోస్ట్ గా అలరించనున్న విషయం తెలిసిందే. ఈ షోకి వచ్చే తొలి గెస్ట్ గా మోహన్ బాబు తన కుమార్తె మంచు లక్ష్మి, కుమారుడు మంచు విష్ణుతో వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో అలరిస్తోంది.
'ఎవరి జీవితం కళాప్రపూర్ణమో... ప్రజల సేవ సంపూర్ణమో ఆయనే..' అంటూ మోహన్ బాబును బాలకృష్ణ పిలవబోయారు. అంతలోనే మోహన్ బాబు షోలో అడుగుపెట్టారు. దీంతో బాలకృష్ణ... 'చాదస్తం... ఇంట్రడక్షన్ కాకుండానే వచ్చేస్తారు' అని చురకలంటించారు. మోహన్ బాబుని ఈ షోలో బాలయ్య పలు ప్రశ్నలు అడిగారు.
బాలకృష్ణ: ఏంటింకా ఇరవై ఏళ్ల కుర్రాడిలా ఉన్నారు?
మోహన్ బాబు: ఎవరికి వయసైంది.. నీకైంది వయసు
బాలకృష్ణ: (నా వయసు) పదహారు
మోహన్ బాబు: ఆ..!
బాలకృష్ణ: మీరు నటించిన సినిమాల్లో అస్సలు చూసుకోలేని సినిమా ఏది?
మోహన్ బాబు: పటాలం పాండు అని
బాలకృష్ణ: బాగా రాడ్ రంభోలా?
మోహన్ బాబు: నా వైఫ్ నిర్మల
బాలకృష్ణ: అదే పిన్ని గారూ (నవ్వుతూ)
బాలకృష్ణ: చిరంజీవిగారి మీద మీకు నిజంగా ఉన్న అభిప్రాయం ఏమిటీ?
మోహన్ బాబు: ఆయన (పై వాడు) అన్నీ చూస్తుంటాడు
బాలకృష్ణ: రాజకీయాలపై మాట్లాడొద్దు
మోహన్ బాబు: 100 శాతం కొట్టికొట్టి చెప్పగలను
బాలకృష్ణ: ఇది పర్సనల్ ప్రశ్న.. రాత్రి 7.30 గంటల తర్వాత? (ఏక్ పెగ్ లా అంటూ మ్యూజిక్)
నా బిడ్డలను మోసం చేస్తున్నానని అనిపించింది: మోహన్ బాబు
'హీరోగా నిలబడాలన్న ప్రయత్నంలో విఫలమవుతున్నానని ఎప్పుడన్నా బాధపడ్డారా?' అని బాలకృష్ణ అడిగారు. దీంతో మోహన్ బాబు స్పందిస్తూ... 'తలుచుకుంటే ఏడుపు వస్తోంది. నా బిడ్డలకు మోసం చేస్తున్నానని అనిపించింది. నేను ఉన్న ఇల్లు అమ్మేశాను. ఈ బాధలో నేను ఓ విషయం అడుగుతాను. అన్నగారు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగు దేశం పార్టీ. ఆయన తర్వాత ఆ పార్టీ పగ్గాలు మీరు తీసుకోకుండా చంద్రబాబుకు ఎందుకు ఇచ్చారు?' అని మోహన్ బాబు అడిగారు.
మోహన్ బాబు, బాలకృష్ణ మధ్య జరిగిన పూర్తి ఆసక్తికర సంభాషణలు, ప్రశ్నలు, జవాబులు తెలుసుకోవాలంటే నవంబరు 4 వరకు ఆగాల్సిందే.