Taliban: తమ ప్రభుత్వాన్ని గుర్తించాలంటూ ప్రపంచ దేశాలకు తాలిబన్ల విజ్ఞప్తి

Taliban appeals nations to recognize Afghan govt
  • ఆఫ్ఘన్ లో ప్రభుత్వాన్ని కూలదోసిన తాలిబన్లు
  • అధికారం చేజిక్కించుకున్న వైనం
  • పాక్, చైనా తప్ప మరే దేశం నుంచి లభించని గుర్తింపు
  • తమ నిధులు విడుదల చేయాలంటూ తాలిబన్ల ప్రకటన
ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూల్చి పాలనా పగ్గాలు అందుకున్న తాలిబన్లు ఇప్పటికీ తమను ప్రపంచదేశాలు గుర్తించకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాకిస్థాన్, చైనా తప్ప మరే దేశం కూడా తమను అధికారికంగా గుర్తించకపోవడం పట్ల తాలిబన్లు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆఫ్ఘన్ లో తమ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించాలని, వివిధ దేశాల్లో నిలిచిపోయిన నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన ఆస్తులపై ఉన్న ఆంక్షలను తొలగించాలని, లేకపోతే ఇది ప్రపంచ సమస్యగా మారుతుందని తాలిబన్ వర్గాలు హెచ్చరించాయి. ఈ మేరకు తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు.
Taliban
Afghanistan
Govt
Nations

More Telugu News