Allu Arjun: మతిపోతోంది... 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్ పై అల్లు అర్జున్ స్పందన

Allu Arjun responds to RRR glimpse video
  • ఆర్ఆర్ఆర్ నుంచి గ్లింప్స్ వీడియో విడుదల
  • సోషల్ మీడియాలో దూసుకుపోతున్న వీడియో
  • రాజమౌళిపై బన్నీ ప్రశంసలు
  • యావత్ చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్
'ఆర్ఆర్ఆర్' చిత్రం నుంచి అభిమానులను ఉర్రూతలూగించేలా తాజా గ్లింప్స్ విడుదలైంది. పలు రోమాంఛక దృశ్యాల సమాహారంగా 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం విడుదల చేసిన ఈ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. దీనిపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్ చూస్తే మతిపోతోందని వ్యాఖ్యానించారు. "రాజమౌళి గారూ మీరు భారతీయ చిత్రపరిశ్రమకు గర్వకారణం" అని కొనియాడారు.

"మైండ్ బ్లోయింగ్!... నా బ్రదర్ రామ్ చరణ్, నా బావ తారక్ కలిసి పవర్ ప్యాక్ షో అందించారు. అజయ్ దేవగణ్ కు, అలియా భట్ కు, యావత్ తారాగణం, సాంకేతిక నిపుణుల బృందానికి శుభాకాంక్షలు" అంటూ బన్నీ ట్వీట్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్ వీడియోను కూడా పంచుకున్నారు. దీనిపై ఎస్ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ స్పందిస్తూ, "థాంక్యూ సో మచ్ అన్నా" అంటూ అల్లు అర్జున్ కు బదులిచ్చారు.
Allu Arjun
RRR
Glimpse Video
Rajamouli
Ramcharan
Junior NTR
Tollywood

More Telugu News