Manmohan Singh: ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

Former PM Manmohan Singh discharged from AIIMS
  • ఇటీవల డెంగీ బారినపడిన మాజీ ప్రధాని
  • ఎయిమ్స్ లో చేరిక
  • మెరుగుపడిన ఆరోగ్యం
  • అందరికీ కృతజ్ఞతలు తెలిపిన మన్మోహన్ అర్ధాంగి
ఇటీవల డెంగీ జ్వరం కారణంగా ఆసుపత్రి పాలైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు డిశ్చార్జి అయ్యారు. ఇటీవల మన్మోహన్ అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి మెరుగవడంతో నేడు ఇంటికి చేరుకున్నారు. మన్మోహన్ డెంగీ నుంచి కోలుకుంటున్నారని ఆయన అర్ధాంగి గురుశరణ్ కౌర్ వెల్లడించారు. మన్మోహన్ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చడంలో ఎంతో శ్రమించిన ఎయిమ్స్ డాక్టర్లకు, నర్సులకు, ఇతర సహాయక సిబ్బందికి, మన్మోహన్ క్షేమాన్ని కాంక్షించిన శ్రేయోభిలాషులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఆమె వివరించారు.
Manmohan Singh
AIIMS
Dengue
New Delhi

More Telugu News