farmers: పాదయాత్ర చేస్తోన్న అమరావతి రైతులకు కాడెద్దులతో స్వాగతం పలికిన ప్రత్తిపాడు రైతులు
- ఐదో రోజుకు చేరిన రైతుల పాదయాత్ర
- ఇంజనీరింగ్ విద్యార్థుల మద్దతు
- నేడు 15 కిలోమీటర్ల మేర పాదయాత్ర
ఆంధ్రప్రదేశ్లోని అమరావతి రైతులు మొదలుపెట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ‘మహా పాదయాత్ర’ ఐదో రోజు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం నుంచి ప్రారంభమైంది. వారికి ఇంజనీరింగ్ విద్యార్థులు మద్దతు తెలిపి, తమ భవిష్యత్తు బాగుండాలంటే అమరావతే రాజధానిగా ఉండాలని ఆకాంక్షించారు.
అలాగే, పాదయాత్ర చేస్తోన్న వారికి ప్రత్తిపాడులో స్థానిక రైతులు కాడెద్దులతో స్వాగతం పలికారు. ఐదో రోజు పాదయాత్ర 15 కిలోమీటర్ల మేర కొనసాగనుంచి. అది పెదనందిపాడులో ముగిసి, మళ్లీ రేపు ఉదయం ప్రారంభం కానుంది. కాగా, నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు మొత్తం 45 రోజుల పాటు పాదయాత్ర చేస్తున్నట్లు అమరావతి జేఏసీ, రైతు సంఘాల నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే.