Lunar Eclipse: ఈ నెల 19న ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం
- ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణం
- 3 గంటల 28 నిమిషాల పాటు కొనసాగనున్న గ్రహణం
- భారత్ లో ఈశాన్య రాష్ట్రాల్లో కనిపించనున్న గ్రహణం
- ఉత్తర అమెరికా దేశాల్లో పూర్తిగా కనిపించనున్న వైనం
ఈ నెల 19న ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినా ఏకంగా 3 గంటల 28 నిమిషాల పాటు కనువిందు చేయనుంది. ఇది భారత్ లోనూ కనిపిస్తుంది. అయితే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం తదితర ప్రాంతాల్లో చూడొచ్చు.
ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని ఉత్తర అమెరికా ఖండంలోని 50 దేశాల వారు పూర్తిగా వీక్షించవచ్చు. అంతేకాదు, దక్షిణ అమెరికా ఖండంలోని మెక్సికోలోనూ ఇది దర్శనమిస్తుంది. దీన్ని ఫ్రాస్ట్ మూన్ (మంచుతో కప్పబడిన చంద్రుడు) అని పిలుస్తారని నాసా వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణం.