Pakistan: టీమిండియాపై పాకిస్థాన్ అసత్య ప్రచారం.. ఈ వీడియోను వైరల్ చేస్తోన్న వైనం
- ఆఫ్ఘన్‌తో ఇటీవల టీమిండిమా మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్
- ఆ సమయంలో బౌలింగ్ ఫస్ట్ అంటూ కోహ్లీ అన్నాడని అసత్య ప్రచారం
- వీడియోను వక్రీకరిస్తూ పాక్ నెటిజన్ల పోస్టులు
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో జరిగిన తొలి రెండు మ్యాచుల్లో ఓడిపోయిన టీమిండియా అనంతరం ఆఫ్ఘనిస్థాన్, స్కాట్లాండ్‌లపై విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్థాన్ అభిమానులు టీమిండియా గెలుపు ఓర్చుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ సంతోషపడుతున్నారు.
ఆఫ్ఘన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్ సమయంలో వేసిన టాస్ వీడియోను పోస్ట్ చేస్తూ భారత్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఆ వీడియోలో ఆఫ్ఘన్ సారథి మహ్మద్ నబి టాస్ గెలిచాక మొదట బౌలింగ్ చేస్తామని చెప్పినట్లు వినపడుతోంది.
దాన్ని పాక్ అభిమానులు వక్రీకరిస్తూ ఆ వ్యాఖ్య టీమిండియా కెప్టెన్ కోహ్లీ చేశాడని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఆ సమయంలో కనీసం కోహ్లీ పెదవులు కూడా కదలలేదు. అయినప్పటికీ బౌలింగ్ ఫస్ట్
తీసుకోవాలని కోహ్లీ చెప్పాడని పాక్ అభిమానులు అంటున్నారు. మహ్మద్ నబి చేసిన వ్యాఖ్యను కోహ్లీ వ్యాఖ్యగా వక్రీకరించి మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు.