Afghanistan: అందరి దృష్టి ఈ మ్యాచ్ పైనే... న్యూజిలాండ్ పై టాస్ నెగ్గిన ఆఫ్ఘనిస్థాన్

Afghanistan takes on New Zealand in much anticipated match
  • నేడు కివీస్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్
  • బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్
  • న్యూజిలాండ్ గెలిస్తే నేరుగా సెమీస్ చేరిక
  • భారీ తేడాతో గెలిస్తే ఆఫ్ఘన్ జట్టుకూ సెమీస్ అవకాశాలు
  • రేపు నమీబియాతో ఆడనున్న టీమిండియా
టీ20 వరల్డ్ కప్ లో నేడు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. మామూలుగా చూస్తే ఈ మ్యాచ్ ఓ లీగ్ పోరు మాత్రమే అయినా, టీమిండియా భవితవ్యం ఈ మ్యాచ్ పై ఆధారపడి ఉండడంతో యావత్ క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. సూపర్-12 దశ గ్రూప్-2లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ గెలవాలని టీమిండియా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓడిపోతే టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఇక్కడే ఓ ప్రమాదం కూడా పొంచి ఉంది. ఆఫ్ఘనిస్థాన్ గనుక భారీ తేడాతో నెగ్గితే ఆ జట్టుకు కూడా సెమీస్ చాన్సులు కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇవాళ న్యూజిలాండ్ ఓడిపోవాలి.... రేపు నమీబియాపై టీమిండియా అత్యంత ఘనవిజయం సాధించాలన్నది భారత అభిమానుల ఆకాంక్ష.

ఇక నేటి మ్యాచ్ విషయానికొస్తే... న్యూజిలాండ్ పై టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘన్ జట్టులోకి యువ స్పిన్నర్ ముజీబ్ పునరామగనం చేశాడు. కివీస్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు.
Afghanistan
New Zealand
Group-2
Super-12
T20 World Cup

More Telugu News