Lava Agni 5G: వచ్చేసింది దేశీయ 5జి ఫోన్.. ఆకట్టుకునే డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో ‘లావా అగ్ని’
- 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
- దేశీయ ఫోన్ కావాలనుకునే వారు ట్రై చేసుకోవచ్చు
- చైనా ఫోన్లకు గట్టి పోటీ
చైనా ఫోన్లు వాడివాడి విసుగెత్తిపోయారా? దేశీయ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, వచ్చేసింది ‘లావా అగ్ని 5జీ’. దేశీయ మొబైల్ మేకర్ లావా ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన తొలి 5జీ ఫోన్ ఇదే. ఆకట్టుకునే డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
నిన్ననే మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్లో వెనకవైపు నాలుగు కెమెరాలు అమర్చారు. వేగవంతమైన మీడియా టెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ ఉపయోగించారు. అలాగే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 90 హెర్ట్జ్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. రియల్‌మి 5జీ, మోటో జి 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీకి ఇది గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ నిపుణుల విశ్లేషణ.
8 జీబీ ర్యామ్ 128 అంతర్గత మెమొరీతో సింగిల్ వేరియంట్లో వచ్చిన లావా అగ్ని 5జీ ధర రూ. 19,999 మాత్రమే. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ అందుబాటులో ఉంది. ఈ నెల 18 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాదు, రూ. 500 చెల్లించి ఫోన్‌ను ముందస్తుగానూ బుక్ చేసుకోవచ్చు. ముందస్తు బుకింగ్ ద్వారా రూ. 2000 రాయితీ పొందే అవకాశం ఉంది.
లావా అగ్ని 5జీ స్పెసిఫికేషన్లు ఇలా:
* ఆండ్రాయిడ్ 11 ఓఎస్
* 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
* 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్
* హోల్‌పంచ్ డిజైన్
* 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ
* 64 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు
* సెల్ఫీల కోసం ముందువైపు 16 ఎంపీ కెమెరా
* ప్రీలోడెడ్ కెమెరా మోడ్స్
* 5జి, 4జి వీవోఎల్టీఈ కనెక్టివిటీ
* సైడ్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్
* 5,000 ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన ఇన్‌బిల్ట్ బ్యాటరీ