PUBG: భారత్ లో పబ్జీ పునరాగమనం... ఈసారి కొత్త పేరుతో!
- చైనా, భారత్ మధ్య ఘర్షణలు
- పబ్జీని గతేడాది నిషేధించిన భారత్
- మార్పులు చేర్పులతో కొత్త పబ్జీ తీసుకువచ్చిన క్రాఫ్టన్ సంస్థ
- గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న గేమ్
పబ్జీ... కుర్రకారును విశేషంగా ఆకట్టుకున్న ఈ గేమ్ గతేడాది భారత్ లో నిషేధానికి గురైంది. గాల్వన్ లోయలో చైనాతో తీవ్ర ఘర్షణల నేపథ్యంలో చైనా యాప్ లపై భారత్ ఉక్కుపాదం మోపడంతో పబ్జీపైనా వేటు పడింది. అయితే భారత్ లోని తమ యూజర్లను నిరాశపర్చకుండా అప్పట్లోనే బీజీఐఎం పేరుతో ఓ గేమ్ తీసుకువచ్చిన పబ్జీ మాతృసంస్థ క్రాఫ్టన్.... ఈసారి కొత్త పేరుతో రంగప్రవేశం చేసింది.
'పబ్జీ: న్యూ స్టేట్' అనే పేరుతో ఈ కొత్త గేమ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈసారి దీన్ని 17 భాషల్లో రూపొందించడం విశేషం. ప్రస్తుతం పబ్జీ: న్యూ స్టేట్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. దీనిపై పబ్జీ సొంతదారు కాఫ్టన్ సంస్థ స్పందిస్తూ, పబ్జీ కొత్త గేములో అధునాతన ఆయుధాలు, వినూత్న వాహనాలు, అనేక రకాల ఫీచర్లు ఉన్నాయని వెల్లడించింది.