Hyderabad: కొత్తగా పెళ్లైన హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భార్గవి అదృశ్యం

Newly married software engineer Bhargavi goes missing in Hyd
  • ఈ నెల 10న ఇంటి నుంచి బయటకు వచ్చిన భార్గవి
  • కాచిగూడ, మలక్ పేట, పంజాగుట్ట సీసీటీవీ ఫుటేజీల్లో కనిపించిన వైనం
  • మూసారంబాగ్ మెట్రో స్టేషన్ వద్ద సెల్ ఫోన్ పడేసిన భార్గవి
హైదరాబాదులో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. భార్గవి అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు ఇటీవలే పెళ్లి అయింది. దోమల్ గూడలోని తన నివాసం నుంచి ఈనెల 10న ఆమె బయటకు వచ్చింది. బ్యూటీ పార్లర్ కు వెళ్లొస్తానని చెప్పిన ఆమె ఇంత వరకు తిరిగి రాలేదని ఇంట్లోవాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

కాచిగూడ, మలక్ పేట, పంజాగుట్ట ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీల్లో ఆమె కనిపించారు. ఈ ఫుటేజీ ఆధారంగా ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారు. మూసారంబాగ్ మెట్రో స్టేషన్ వద్ద సెల్ ఫోన్ పడేసిందని, కాచిగూడ రైల్వేస్టేషన్ కు వెళ్లి రైలు ఎక్కకుండా తిరిగి పంజాగుట్టకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. పంజాగుట్ట సెంట్రల్ వద్ద బస్సు ఎక్కేందుకు ఆమె యత్నించినట్టు భావిస్తున్నారు. ఆ తర్వాత ఆటోలో మలక్ పేటకు వెళ్లినట్టు చెపుతున్నారు.
Hyderabad
Software Engineer
Bhargavi
Missing

More Telugu News