Prashant Reddy: డబ్బులు లేక కేంద్రం వద్ద ఏపీ సీఎం అడుక్కుంటున్నారు: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి

Jagan is begging with Center says TS minister Prashant Reddy
  • తెలంగాణ వస్తే అడుక్కుంటారన్న వాళ్లే ఇప్పుడు బిచ్చమెత్తుకుంటున్నారు
  • ఏపీ నడవాలంటే కేంద్ర నిధులు కావాలి
  • కేంద్రం ఒత్తిడితోనే ఏపీ ప్రభుత్వం రైతులకు మీటర్లు బిగించింది
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిధులు లేక ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వం వద్ద అడుక్కుంటున్నారని అన్నారు. తెలంగాణ వస్తే అడుక్కుతింటారని ఎద్దేవా చేసినవారే... ఇప్పుడు బిచ్చమెత్తుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడవాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులు కావాలని అన్నారు.

 కేంద్రం ఒత్తిడితోనే రైతుల వ్యవసాయ మోటార్లకు ఏపీ ప్రభుత్వం కొత్త మీటర్లు బిగించిందని చెప్పారు. దేశం మొత్తంలో రైతుల మోటార్లకు మీటర్లను బిగించాలనేది మోదీ ఆలోచన అని... తెలంగాణలో మాత్రం మీటర్లు పెట్టబోమని అన్నారు. రైతులను కేంద్ర ప్రభుత్వం చాలా మోసం చేస్తోందని... బీజేపీ నేతలను ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకోవాలని చెప్పారు. బీజేపీ బట్టెబాజ్, లఫంగి గాళ్లకు ధర్నా చేయాలని ఎలా అనిపించిందని ప్రశ్నించారు.
Prashant Reddy
TRS
Jagan
YSRCP

More Telugu News