VVS Laxman: జాతీయ క్రికెట్ ఆకాడమీ చీఫ్ గా వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman appointed as NCA Chief

  • ఇప్పటివరకు ఎన్సీఏ చీఫ్ గా ద్రావిడ్
  • టీమిండియా హెడ్ కోచ్ గా వెళ్లిన ద్రావిడ్
  • ఖాళీ అయిన ఎన్సీఏ చీఫ్ పదవి
  • లక్ష్మణ్ తో చర్చించిన గంగూలీ, జై షా

బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కొత్త చీఫ్ గా భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ నియమితుడయ్యాడు. ఇప్పటివరకు ఎన్సీఏ అధిపతిగా వ్యవహరించిన రాహుల్ ద్రావిడ్ టీమిండియా ప్రధాన కోచ్ గా వెళ్లడంతో బీసీసీఐ లక్ష్మణ్ వైపు మొగ్గుచూపింది. ఎన్సీఏ చీఫ్ గా లక్ష్మణ్ నియామకాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిర్ధారించాడు.

క్రికెట్ నుంచి రిటైరయ్యాక లక్ష్మణ్ ప్రముఖ కామెంటేటర్ గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎన్సీఏ చీఫ్ పదవిని చేపట్టేందుకు తొలుత విముఖత ప్రదర్శించినా, ఆ తర్వాత గంగూలీ, జై షా (బీసీసీఐ కార్యదర్శి) జోక్యంతో మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.

బీసీసీఐ నియమావళి ప్రకారం లక్ష్మణ్ కామెంటరీ, బోర్డు పదవి ఈ రెండింటిలో ఏదో ఒకదాంట్లోనే కొనసాగాల్సి ఉంటుంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశంలో బీసీసీఐ గతంలోనే మార్గదర్శకాలు జారీ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, లక్ష్మణ్ కు ఎన్సీఏ చీఫ్ గా భారీగా ముట్టజెప్పే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News