Prakash Raj: గొంతు బాగాలేదు... ఓ వారం పాటు మౌన వ్రతం: ప్రకాశ్ రాజ్

Prakash Raj reveals his health condition

  • ప్రకాశ్ రాజ్ కు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు
  • స్వర తంత్రులు దెబ్బతిన్నాయన్న డాక్టర్లు
  • వారం రోజులు మాట్లాడరాదని సూచన
  • ట్విట్టర్ లో వెల్లడించిన ప్రకాశ్ రాజ్

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తన ఆరోగ్య పరిస్థితిపై ట్విట్టర్ లో స్పందించారు. ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నానని వెల్లడించారు. అయితే గొంతులో స్వర తంత్రులకు విశ్రాంతి ఇవ్వాలని, మాట్లాడరాదని డాక్టర్లు సూచించారని తెలిపారు. అంతకుమించి మిగతా ఆరోగ్యానికి ఢోకా లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఓ వారం పాటు మౌన వ్రతం తప్పదని, సైగలతోనే నెట్టుకొస్తానని వివరించారు.

  • Loading...

More Telugu News