Team India: న్యూజిలాండ్ స్కోర్ 164.. దూకుడుగా ఆడుతున్న భారత్!
- భోపాల్ లో ఇండియా, న్యూజిలాండ్ తొలి టీ20
- 70 పరుగులు చేసిన మార్టిన్ గుప్టిల్
- 31 పరుగులతో దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ
రోహిత్ శర్మ కెప్టెన్ గా, రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా టీమిండియా సరికొత్త ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో భాగంగా భోపాల్ లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. భారత్ ముందు 165 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ లో మార్టిన్ గుప్టిల్ 70 పరుగులు, మార్క్ చాప్ మన్ 63 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్, సిరాజ్ చెరో వికెట్ తీశారు.
ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు నిలకడగా రాణిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడుతున్నారు. వీరిద్దరూ 4.5 ఓవర్లలో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ 16 బంతుల్లో 31 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 13 బంతుల్లో 15 రన్స్ చేశాడు.