Sensex: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- 1,170 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 348 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 5.74 శాతం నష్టపోయిన బజాజ్ ఫైనాన్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పాటు... అంతర్జాతీయంగా ప్రతికూలతలు కూడా ఎదురుకావడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,170 పాయింట్లు కోల్పోయి 58,465కి పడిపోయింది. నిఫ్టీ 348 పాయింట్లు నష్టపోయి 17,416కి దిగజారింది. టెలికాం, మెటల్ మినహా మిగిలిన అన్ని స్టాకులు నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.90%), ఏసియన్ పెయింట్స్ (1.14%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.99%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-5.74%), బజాజ్ ఫిన్ సర్వ్ (-4.69%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-4.42%), ఎన్టీపీసీ (-3.73%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.47%).