Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... మళ్లీ ఆ నాలుగు జిల్లాలే టార్గెట్!

Low pressure forms in Bay of Bengal as rain forecast for AP

  • ఏపీ దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు
  • నవంబరు నెలంతా వానలే!
  • బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు
  • ఇటీవలే దక్షిణ కోస్తా జిల్లాల్లో వరదలు

ఈ నవంబరులో ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కావడం తెలిసిందే. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు, ఈశాన్య రుతువపనాలతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మొన్న తమిళనాడు వద్ద వాయుగుండం తీరం దాటిన అనంతరం చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈసారి కూడా నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాలపైనే తీవ్ర స్థాయిలో ప్రభావం ఉంటుందని, ఈ నెల 27 నుంచి ఆ నాలుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తాజా నివేదికలో పేర్కొన్నారు. అనంతపురం జిల్లాతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా, ఇప్పటికే నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం (పాక్షికంగా) జిల్లాలు వరద ప్రభావంతో తల్లడిల్లాయి. తాజాగా అతి భారీ వర్ష సూచన రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

  • Loading...

More Telugu News