Mobile Phones: ఏపీ అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం

Mobile phones banned in AP assembly

  • స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం
  • సభ్యులెవరూ ఫోన్లు తీసుకువరావద్దని స్పష్టీకరణ
  • మండలి డిప్యూటీ చైర్ పర్సన్ గా జకియా ఖానుమ్
  • స్వయంగా పోడియం వద్దకు తీసుకువచ్చిన సీఎం
  • మండలి నిరవధిక వాయిదా

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించారు. సభలోకి సభ్యులెవరూ ఫోన్లు తీసుకువరావద్దని తమ్మినేని స్పష్టం చేశారు.

అటు, ఏపీ శాసనమండలి సమావేశాలు నేటితో ముగిశాయి. మండలి నిరవధికంగా వాయిదాపడింది. అంతకుముందు, మండలి డిప్యూటీ చైర్ పర్సన్ గా జకియా ఖానుమ్ ఎన్నికయ్యారు. ఆమెను సీఎం జగన్ స్వయంగా చైర్ వద్దకు తొడ్కొని వచ్చారు. తనకు డిప్యూటీ చైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చినందుకు ఆమె సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, "అధ్యక్షా" అని సంబోధించే స్థానంలో అక్క లాంటి వ్యక్తి (జకియా ఖానుమ్) కూర్చోవడం సంతోషాన్నిస్తోందని వెల్లడించారు. జకియా ఖానుమ్ సాధారణ మైనారిటీ కుటుంబం నుంచి వచ్చారని, ఆమె నేడు మండలి డిప్యూటీ చైర్ పర్సన్ స్థాయికి ఎదగడం మైనారిటీ మహిళలకు స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News