Corona Virus: ఉదాసీనత వద్దు.. ప్రజలు తక్షణం అప్రమత్తం కావాలి: కరోనా కొత్త వేరియంట్‌పై విజయసాయిరెడ్డి
- దక్షిణాఫ్రికా, బోట్స్ వానా దేశాల్లో కొత్త వేరియంట్
- డబ్ల్యూహెచ్‌వో ఈ విషయాన్ని వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది
- యూరప్ లోని పలు ఎయిర్ లైన్స్ ఆ దేశాలకు సర్వీసులు నిలిపేశాయి
- అందరూ టీకాలు తీసుకోవాలి
దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఆ వేరియంట్ చాలా ప్రమాదకరమని ఇప్పటికే వైద్య నిపుణులూ వెల్లడించడంతో అనేక దేశాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.
'దక్షిణాఫ్రికా, బోట్స్ వానా దేశాల్లో B.1.1529 అనే కరోనా రకాన్ని గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది. యూరప్ లోని పలు ఎయిర్ లైన్స్ ఆ దేశాలకు సర్వీసులు నిలిపేశాయి. టీకాలు తీసుకోకుండా ఉదాసీనత కనబరుస్తున్నవారు తక్షణం అప్రమత్తం కావాలి. కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి' అని విజయసాయిరెడ్డి సూచించారు.