Omicron: ఒమిక్రాన్ లక్షణాలు, వేరియంట్ తీవ్రత గురించి.. దానిని గుర్తించిన డాక్టర్ ఏమన్నారంటే...

South African Medical Association Chairperson About Omicron

  • మామూలు లక్షణాలేనన్న ఏంజెలిక్ కొయెట్జీ
  • అలసట, తలనొప్పి, ఒళ్లునొప్పులుంటాయని వెల్లడి
  • జ్వరం, వాసన–రుచి కోల్పోవడం ఉండవని కామెంట్

ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు, తీవ్రత గురించి ఆ వేరియంట్ ను గుర్తించిన సౌతాఫ్రికా మెడికల్ అసోసియేషన్ చైర్ పర్సన్ డాక్టర్ ఏంజెలిక్ కొయెట్జీ వివరణ ఇచ్చారు. ఒమిక్రాన్ తో తీవ్రమైన జబ్బు లక్షణాలేం ఉండవని ఆమె చెప్పారు. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, తీవ్రమైన అలసట వంటి లక్షణాలుంటాయన్నారు. అయితే, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉండవని పేర్కొన్నారు. ముక్కు మూసుకుపోవడం, తీవ్రమైన జ్వరమూ ఉండవన్నారు.

డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ తో వచ్చే లక్షణాల తీవ్రత చాలా తక్కువని ఆమె తెలిపారు. ఆసుపత్రిలో చేరే ముప్పు చాలా తక్కువేనని, ఇంట్లోనే నయం చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం యువతలోనూ ఇది ప్రభావం చూపిస్తోందని, అయితే, యువతపైనే దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని ఇప్పుడే నిర్ధారించలేమని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికీ ఒమిక్రాన్ సంక్రమించడంపైనా ఆమె మాట్లాడారు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకూ అది సోకినా.. వ్యాక్సిన్ వేసుకోని వాళ్లతో పోలిస్తే రక్షణ ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. టీకాలు వేయించుకోకుంటే వీలైనంత త్వరగా తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News